మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాలు డిసెంబర్ 15వ తేదీలోపు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి చేరుతాయని ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసిపి ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు. బుధవారం ప్రజా ఉద్యమం కార్యక్రమం ర్యాలీలో పాల్గొన్న నాగార్జున రెడ్డి పేదలకు ఉచిత వైద్య విద్యతోపాటు వైద్యం అందాలన్నదే మాజీ సీఎం జగనన్న ముఖ్య ఉద్దేశమని నాగార్జున రెడ్డి తెలిపారు.