భీమిలి: ఎంబిబిఎస్ విద్యార్థి కళాశాల భవనం పై నుండి దూకి మృతి చెందిన ఘటన పై మాట్లాడిన జింసర్ హెడ్ అఫ్ ఆపరేషన్ డాక్టర్ కార్తిక్
గీతం మెడికల్ కళాశాలలో దారుణ ఘటన బుధవారం చోటు చేసుకుంది. విశాఖ గీతం మెడికల్ కాలేజ్ లో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల బిల్డింగ్ ఆరవ అంతస్తుపై నుండి దూకి మృతి చెందాడు. మృతుడు 20 ఏళ్ల విస్మాద్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ కు చెందినవాడిగా గుర్తించారు. ఈ ఘటనపై జింసర్ ఆసుపత్రి హెడ్ అఫ్ ఆపరేషన్ డాక్టర్ కార్తీక్ మీడియాతో మాట్లాడారు. మొదటి సంవత్సరం ఎంబిబిఎస్ చదువుతున్న విస్మాద్ సింగ్ మృతి కి గల కారణాలు పోలీసులు విచారిస్తున్నట్లు తెలిపారు. కళాశాలలో ఎటువంటి ర్యాగింగ్ లేదు అన్నారు. విద్యార్థి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది అన్నారు.