సర్వేపల్లి: వైసీపీ శవ రాజకీయాలు చేస్తోంది : జనసేన సర్వేపల్లి ఇంచార్జి సురేష్ నాయుడు
రాష్ట్రంలో జరిగే ప్రతి విషయాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ సురేష్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. శవ రాజకీయాలు చేస్తే రాష్ట్ర ప్రజలు క్షమించరని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. సర్వేపల్లి లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమిపాలన మరో 15 ఏళ్లు ఉంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.