హిమాయత్ నగర్: మినిస్టర్స్ క్వార్టర్స్ లో డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాదులో గతంలో డబల్ బెడ్ రూమ్ కేటాయించి కోర్టు కేసులో ఆగిపోయి కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చిన చార్మినార్ మలక్పేట యాకుత్పురా చంద్రయనగుట్ట నియోజకవర్గం సంబంధించి లబ్ధిదారులకు మినిస్టర్స్ క్వార్టర్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలను శుక్రవారం మధ్యాహ్నం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబర్పేటలో 134 బహదూర్పురలో 294 బండ్లగూడలో 155 చార్మినార్ లో 209 ఇళ్ల పట్టాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చిన అనంతరం పట్టాలు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.