మెదక్: తెలంగాణ సాంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేది బతుకమ్మ పండుగ
Medak, Medak | Sep 20, 2025 సాంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేది బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేసే విధంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించినట్లు రామాయంపేట లోని తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ విజయలక్ష్మి ఆదివారం సాయంత్రం తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మీడియా తో మాట్లాడుతూ తొమ్మిది రోజులపాటు నిర్వహించే బతుకమ్మ వేడుకల విషయం విద్యార్థులందరూ తెలుసుకోవాలని బతుకమ్మ సంబరాలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేస్తామన్నారు.