కరీంనగర్: కరీంనగర్ లో మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం..తీవ్రంగా ఇబ్బంది పడ్డ కలెక్టరేట్ ఆవరణలో చిక్కుకున్న ప్రజలు.
కరీంనగర్ నగరంలో బుధవారం మధ్యాహ్నం 3గంటలకు ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. ఉదయం నుంచి ఉక్కపోతతో ఇబ్బంది పడిన ప్రజలకు ఈ వర్షం ఊరటనిచ్చింది. భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. దీంతో ప్రజలు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో వర్షం పడినప్పుడల్లా నీరు నిలిచిపోవడం సాధారణమైంది. కార్యాలయాలకు వెళ్లే రెండు ప్రధాన రహదారులపై నీరు నిలవడంతో ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయాల పనుల కోసం వచ్చే వృద్ధులు, మహిళలు, విద్యార్థులు బయటికి వెళ్లలేక ఇరుక్కుపోతున్నారు.