పలాస: పలాస సీఎం చంద్రబాబు పాలనలో రెండు ఘటనలు చీకటి అధ్యాయానికి తెర లేపాయని ధ్వజమెత్తిన మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు
సీఎం చంద్రబాబు పాలనలో రెండు ఘటనలు చీకటి అధ్యాయానికి తెరలేపాయని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. పలాసలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చేయడం ఒకటి, అయ్యన్నపాత్రుడికి స్పీకర్ పదవి కట్టబెట్టడం మరోటి అని విమర్శించారు. TDP అధికారంలోకి రాగానే దాడులు మొదలయ్యాయని ధ్వజమెత్తారు. సీఎంగా కుర్చీలో కూర్చోని 2వారాలు గడుస్తున్నా ఇచ్చిన హామీల గురించి మాట్లాడలేదన్నారు.