ఇబ్రహీంపట్నంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంగళవారం సాయంత్రం వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు నేరుగా గ్రామాల వరకు చేరుతున్నాయని అన్నారు. మూడవ దశ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి ప్రజా ప్రభుత్వానికి మరింత బలాన్ని చేకూర్చాలని కోరారు.