పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనుల పరిశీలన చేపట్టనున్న ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనుల పరిశీలన సోమవారం పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి చేపట్టనున్నట్లు ఆదివారం ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. పనుల పరిశీలనతో పాటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీల స్వీకరణ చేపట్టి సమస్యల పరిష్కారం పై అధికారులతో సమీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.