ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని కుడిచేడు రోడ్డులో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించినాడని తల్లిదండ్రులు దాడికి పాల్పడిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఇరువురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఉపాధ్యాయుడు పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు విచారించి సస్పెండ్ చేసినట్లు ఉన్నత విద్యా శాఖ అధికారులు వెల్లడించారు.