పూతలపట్టు: కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు ఘనంగా తెప్పోత్సవం
కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు మంగళ వారం రాత్రి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తులను పుష్కరిణిలో తెప్పపై ఊరేగిస్తూ ప్రత్యేక పూజలు, ప్రత్యేక హారతులు నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, దేవస్థానం ఈవో పెంచల కిషోర్ , స్థానిక నాయకులు మరియు భక్తులు పాల్గొన్నారు.