పూతలపట్టు: పూతలపట్టులో ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే మురళీమోహన్
పూతలపట్టు మండల కేంద్రంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల కేంద్రానికి విచ్చేసిన ఎమ్మెల్యేను స్థానిక నాయకులు ఘనంగా ఆహ్వానించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి ప్రధాని మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని పేదలకు అన్నదానం చేశారు. వారు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. వారి నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై గర్వకారణం అన్నారు.