అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి చెందిన సుధారాణి అనే మహిళ గురువారం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుత్తికి చెందిన సుధారాణి గత కొన్ని నెలలుగా అనారోగ్యసమస్యతో పాటుగా కుటుంబ సమస్యలతో బాధపడుతుండేది. పలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా వ్యాధి నయం కాలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె ఇంట్లో ఎవరు లేని సమయంలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న సుధారాణిని కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.