మార్కాపురం: రాష్ట్ర అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు ఘన నివాళులు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఫారెస్ట్ డివిజన్ కార్యాలయం నందు రాష్ట్ర అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజర్ పిచ్చిరెడ్డి అమరవీరుల స్తూపానికి పుష్పగుచ్చం ఉంచి ఘన నివాళులర్పించారు. ఎంతోమంది ఉద్యోగులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా డ్యూటీ లో అమరులయ్యారన్నారు. వారి త్యాగాలు మరువలేనివి అన్నారు.