ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన ఆరికాటి సాయిలత జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైందని కోచ్ రాఘవరెడ్డి మంగళవారం తెలిపారు. పశ్చిమబెంగాల్లో ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు జరగనున్న పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున ఆడుతుందన్నారు. సాయిలతను పట్టణానికి చెందిన పలువురు అభినందించారు. సాయి లత అద్భుత ప్రతిభ కలిగి ఉందని ఆమె భారత్ జట్టుకు కూడా ఎంపిక కావాలని కోరుకుంటున్నట్లు స్థానికులు అన్నారు.