కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేడ్చల్ నియోజకవర్గంలో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని ఎమ్మెల్యే మల్లారెడ్డి శనివారం తీవ్ర విమర్శలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేడ్చల్ ప్రజల అవసరాల కోసం రూ.43 కోట్ల వ్యయంతో ప్రత్యేక రిజర్వాయర్ను నిర్మించామని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం నియోజకవర్గంలో తాగునీటి సరఫరాతో పాటు కరెంటు కూడా సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. తమ పాలనలో ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపించారు.