దసరా శరన్నవరాత్రులు. బాబా మహాసమాధి దర్శనార్థం భారీగా తరలివచ్చిన దేశ విదేశీ భక్తులు
శ్రీ సత్య సాయి జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.వేడుకల్లో భాగంగా సత్య సాయిబాబా మహాసమాధినీ వివిధ రకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మంగళవారం ఉదయం బాబా మహాసమాధి దర్శనార్థం దేశ విదేశీ భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో పుట్టపర్తిలో కోలాహలంగా మారింది. విశ్వశాంతిని కాంక్షిస్తూ ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో వేద పురుష సప్తహా జ్ఞాన యజ్ఞం కొనసాగుతోంది. దసరా ఉత్సవాలలో భాగంగానే మందిరంలో ఆయుధ పూజ నిర్వహించారు