రాయదుర్గం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా కోర్టుల చుట్టూ తిరుగుతున్న పట్టణంలోని టిడిపి నేతలు
గత వైసిపి ప్రభుత్వం హయాంలో పెట్టిన కేసులో రాయదుర్గం కోర్టులో వాయిదాకు టిడిపి నేతలు హాజరయ్యారు. అప్పట్లో ప్రభుత్వ విధానాలపై నిరసన కార్యక్రమం చేపట్టిన టిడిపి నేతలపై సెక్షన్ 188, 341 ఐపిసి సెక్షన్ల కింద 22 మంది టిడిపి ముఖ్య నాయకులపై కేసు నమోదు చేశారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వైసిపి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎత్తేస్తామని హామీ ఇచ్చినా నేటికీ అమలు కాలేదు. దీంతో నాయకులు నేటికీ కోర్టుల చుట్టూ తిరిగాల్సి వస్తోంది. సోమవారం ఉదయం కోర్టుకు హాజరైన వారిలో టిడిపి పట్టణ అధ్యక్షులు పసుపులేటి నాగరాజు, పద్మశాలి కార్పోరేషన్ డైరెక్టర్ పురుషోత్తం తదితరులు ఉన్నారు.