పూతలపట్టు: కాణిపాకం స్వామివారిని దర్శించిన పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ చక్రవర్తి
కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామివారిని పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ చక్రవర్తి కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం దేవస్థానం ఏఈఓ ఎస్వీ కృష్ణారెడ్డి స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, కోర్టు సిబ్బంది మరియు ఇతరులు పాల్గొన్నారు.