హిమాయత్ నగర్: మొగల్పుర డివిజన్ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తున్నాము: ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్
మొగల్పురా డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్ గురువారం మధ్యాహ్నం అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన డివిజన్ పరిధిలో జరుగుతున్న రోడ్డు పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తున్నామని తెలిపారు. 19 లక్షలతో రోడ్డు పనులను చేపడుతున్నట్టు వెల్లడించారు. పనులు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు.