చిట్టి బోయినపల్లి గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
గుర్రంకొండ మండలం చిట్టి బోయినపల్లి గ్రామంలో టీడీపీ మైనార్టీ యువ నాయకులు ఎస్ ఎల్.టి బాబ్జాన్ ఆధ్వర్యంలో సోమవారం లత హాస్పిటల్ పర్యవేక్షణలో ఎంబిబిఎస్ డాక్టర్ల చేత ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి పలు రకాల అనారోగ్య కారణాలతో వచ్చిన 150మందికి చికిత్సలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ సలహాలు సూచనలు ఇచ్చారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన టీడీపీ సీనియర్ నాయకులు దద్దాల హరి ప్రసాద్ నాయుడు కు బాబ్జాన్ శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. సేవాకార్యక్రమాలు చేస్తున్న ఎస్.ఎల్.టి.బాబ్జాన్ ను దద్దాల హరి ప్రసాద్ నాయుడు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి కొనియాడారు