ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న ఐదు మందిని ఆదివారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.17,740 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పేకాట ఆడుతున్న వారిని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశామని పేకాట ఆడటం చట్టారీత్యా నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.