యర్రగొండపాలెం: తుఫాను కారణంగా నష్టపోయిన రైతుల పంట పొలాలను పరిశీలించేందుకు పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి వస్తున్న కేంద్ర బృందం
తుఫాను సందర్భంగా పంట నష్టం పై అంచనా వేసేందుకు కేంద్ర బృందం సోమవారం పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో పర్యటిస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ఆదివారం వెల్లడించారు. పశ్చిమ ప్రకాశం ప్రాంతాలైన యర్రగొండపాలెం, గిద్దలూరు ప్రాంతాలలో అత్యధికంగా రైతులు వరి, చెరకు, పత్తి, మిర్చి, కంది పంటలు నష్టపోయినట్లుగా అధికారులు తెలిపారు. ఇప్పటికే పంట నష్టం పై అంచనా వేసి ప్రభుత్వానికి పంపించామని నివేదిక సారాంశాలు ప్రకారం కేంద్ర బృందం పర్యటించి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలిపారు.