తలమడుగు: బరంపూర్ లో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ సాగు చేసుకోవటానికి రైతులు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలోని ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ తోపాటు నర్సరీని శుక్రవారం సందర్శించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు లక్ష 15 వేల ఆయిల్ ఫామ్ మొక్కలను నాటడం జరిగిందని తెలిపారు. ఈ ఏడాది 2,100 ఎకరాలలో మొక్కలు నాటడానికి టార్గెట్ పెట్టుకున్నామని వెల్లడించారు.ఇప్పటివరకు 1,500 ఎకరాలకు సంబంధించి రైతులను గుర్తించడం జరిగిందని,మిగతా టార్గెట్ ను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు.