మంచాల మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్ నారాయణరెడ్డి మూడో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు ఎన్నికల సందర్భంగా తగు సూచనలు సలహాలను అందజేశారు. పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. పోలింగ్‌ను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎన్నికల సమయంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని అన్నారు.