భీమవరం: దేవాలయాల అభివృద్ధికి దాసాంజనేయ స్వామి నూతన పాలకవర్గం కృషి చేయాలి : ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు
దేవాలయాల అభివృద్ధికి కృషి చేయాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు దాసాంజనేయ స్వామి దేవస్థానం నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం
ఘనంగా జరిగింది. ఈవో తోట శ్రీనివాసరావు, ఛైర్మన్ దారపురెడ్డి త్రివిక్రమ రావుతో సహా సభ్యులతో ప్రమాణం చేయించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే కోరారు.