నల్గొండ: అంగన్వాడి వ్యవస్థను నిర్వీర్యం చేసే పుట్టాలను మానుకోవాలి: సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
నల్లగొండ జిల్లా : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా ప్రీ ప్రైమరీ స్కూల్ ను ప్రవేశపెట్టి అంగన్వాడీ ప్రైమరీ స్కూల్ ను ప్రవేశపెట్టి అంగన్వాడి వ్యవస్థను పరోక్షంగా నిర్వీర్యం చేసే కుట్రను తిప్పి కొట్టాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి సోమవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నల్గొండ పెద్ద గడియారం సెంటర్లో మంత్రి క్యాంపు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.