యాడికి మండలం కుందనకోట గ్రామానికి చెందిన రామేశ్వరుడు (50) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందాడు. కామేశ్వరుడికి ఛాతిలో విపరీతంగా నొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే రామేశ్వరుడిని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు రామేశ్వరుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. యాడికి తహశీల్దార్ ప్రతాప్ రెడ్డి మంగళవారం కుందనకోట గ్రామానికి వెళ్లారు. మృతదేహంపై పూలమాలవేసి నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందజేశారు.