నరసన్నపేట: సారవకోట: నిధులు వృధా... బోరు వ్యధ
సారవకోట మండల పరిషత్ సమావేశం మందిరం వద్ద ఏర్పాటు చేసిన బోరు నిరుపయోగంగా మారింది. గత రెండు సంవత్సరాల కిందట సుమారు రూ. 80 వేల బోరును మంజూరు చేశారు. వెంటనే దాని పనులు కూడా చేపట్టి బోరు నిర్మించారు. అయితే దీనిని వినియోగంలోకి తీసుకుని వచ్చేందుకు మాత్రం అధికారులు చొరవ చూపకపోవడంతో బోరు హెడ్ కూడా బిగించకుండా గాలికి వదిలేశారు. దీని పనులు పూర్తి చేయాలంటూ స్థానికులు కోరుతున్నారు.