జమ్మలమడుగు: జమ్మలమడుగు : ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అడ్డుకొని కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు
పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అడ్డుకొని కౌన్సిలింగ్ ఇచ్చి బంధువులకు అప్పగించిన సంఘటన కడప జిల్లా జమ్మలమడుగులో చోటుచేసుకుంది.బుధవారం తెలిసిన వివరాల మేరకు మైలవరం మండలం పొన్నంపల్లెకు చెందిన లంబు పవన్ కుమార్ అను వ్యక్తి మంగళవారం జమ్మలమడుగు పట్టణం లోని ముద్దనూరు రోడ్డు, పెన్నా బ్రిడ్జి కింద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నం చేస్తుండగా, మెంథా తూఫాన్ కారణంగా పెన్నా నది వద్ద డ్యూటీలో ఉన్న జమ్మలమడుగు పోలీస్ హెడ్ కానిస్టేబుల్ భాస్కర్ రెడ్డి మరియు రెవెన్యూ సిబ్బంది కనిపెట్టి ఆ వ్యక్తికి కౌన్సిలింగ్ చేసి బంధువులకు అప్పగించారు.