మేడ్చల్: బాకీ కార్డు ఉద్యమమే రేవంత్ సర్కార్ భరతం పట్టే బ్రహ్మోత్సవం : కేటీఆర్
సోమవారం రోజున తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు ప్రారంభించిన ‘బాకీ కార్డు’ ఉద్యమమే రేవంత్ సర్కార్ ను భరతం పట్టే బ్రహ్మాస్త్రమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గల్లీ ఎన్నికలైనా, ఢిల్లీ ఎన్నికలైనా గెలిచేది బీఆర్ఎస్ పార్టీయేనని, తెలంగాణలోని సబ్బండ వర్ణాలు తిరిగి కేసీఆర్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నాయన్నారు.