అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని కసాపురం గ్రామంలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో ఆన్ లైన్ సేవల బుకింగ్ కౌంటర్ ను ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం దేవాదాయ శాఖ అధికారుల ఆదేశాలతో ఆలయ ఈఓ మేడేపల్లి విజయరాజు మంగళవారం రిబ్బన్ కట్ చేసి కౌంటర్ ను ప్రారంభించారు. భక్తులకు మెరుగైన సేవలను అందించాలనే ధ్యేయంతో ఆన్ లైన్ సేవా కౌంటర్ ను ప్రారంభించినట్టు ఈఓ మేడేపల్లి విజయరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు ఆన్ లైన్ కౌంటర్ లో ప్రత్యేక పూజలు చేశారు. ఆన్ లైన్ సేవలకు సంబంధించి ఎలాంటి అవాంతరాలు రాకుండా విజయవంతంగా సేవలు అందించాలని పూజలు చేశారు.