రైతులకు ఎంఆర్పీకే ఎరువులు విక్రయించాలని డిమాండ్ చేస్తూ అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ కిసాన్ సంఘ్ నాయకుల నిరసన
రైతులకు ఎరువులను ఎంఆర్పీకే విక్రయించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కాంగ్రెస్ కిసాన్ సంఘ్ నాయకులు అమలాపురం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. విస్తీర్ణాన్ని బట్టి రైతులకు ఎరువులను అందించాలని రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సంఘ్ ఛైర్మన్ కామన ప్రభాకరరావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మధురాజు, అప్పన శ్రీరామకృష్ణ, బత్తుల సురేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.