తాడిపత్రి: తాడిపత్రి మండలంలోని కడప రోడ్డులో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు, 16 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం
తాడిపత్రి మండల పరిధిలోని కడప రోడ్డులో ఆదివారం రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్కడ గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తున్న షేక్ గపూర్ ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 16 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.