ఆసిఫాబాద్‌లోని శివాలయంలో బుధవారం రాత్రి 8గంటలకు జ్వాలాతోరణం భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ ఆవరణలో భక్తులు దీపాలు వెలిగించారు. ఆలయంలోని అర్చకులు జ్వాలాతోరణం ప్రాముఖ్యతను వివరించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దీంతో ఆలయ అవరణం అంతా దీపకాంతులతో వెలిగిపోయింది.