కర్నూలు: బీ.ఎస్.ఎన్.ఎల్ ఉద్యోగుల సమస్యలను పార్లమెంటులో ప్రస్థావించిన: కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు
బీ.ఎస్.ఎన్.ఎల్ ఉద్యోగుల ఎదరుకుంటున్న సమస్యలను కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పార్లమెంటులో బుధవారం ఉదయం 12 గంటలు ప్రస్థావించారు...పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో భాగంగా జీరో అవర్ లో ఎంపీ మాట్లాడారు...బీ.ఎస్.ఎన్.ఎల్ ఉద్యోగులు ప్రకృతి విపత్తులు, జాతీయ అత్యవసర పరిస్థితులు, కోవిడ్ లాంటి క్లిష్ట సమయాల్లో దేశానికి నిబద్ధతతో సేవలు అందించారన్నారు...విధి నిర్వహణలో ఉద్యోగులు ప్రాణాలు అర్పించినా, వారి సేవలకు గుర్తింపు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు...ఉద్యోగులు తీవ్రమైన ఆర్ధిక పరిస్థితులు, వృత్తి పరమైన ఇబ్బందులు ఎదరుకుంటున్నారన్నారు