రాయదుర్గం: పట్టణంలోని కుమ్మరగుండు వీధిలో తాళం పగులగొట్టి బీరువాలోని నగదు నగరు చోరీ చేసిన దుండగులు
రాయదుర్గం పట్టణంలోని కుమ్మరగుండు వీధిలో తాళం వేసిన ఇంటిలో చోరీ జరిగింది. తోఫిక్ అనే గార్మెంట్ కార్మికుడు పనిమీద శనివారం మొలకల్మూరుకు కుటుంబ సభ్యులతో వెళ్లాడు. సోమవారం రాత్రి తిరిగి వచ్చి చూసేసరికి బీరువాలో దాచిన రూ1.50 లక్షల నగదు, 18 తులాల వెండి నగలు, 1 తులం గోల్డ్ చైన్ చోరీ జరిగినట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మంగళవారం ఉదయం క్లూస్ టీం ద్వారా దర్యాప్తు చేపట్టారు.