తప్పు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించిన కృష్ణ జిల్లా ఎస్పి విద్యాసాగర్ నాయుడు
Machilipatnam South, Krishna | Sep 15, 2025
తప్పు చేస్తే తోలు తీస్తా.. SP హెచ్చరిక కృష్ణా జిల్లా ఎస్పీగా సోమవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం విద్యాసాగర్ నాయుడు 3 గంటల సమయంలో అసాంఘిక శక్తులకు తీవ్రహెచ్చరికలు జారీ చేశారు. తప్పు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. చట్టం అందరికీ వర్తిస్తుందని, తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్షార్హులే అని ఆయన స్పష్టం చేశారు.