నగరి: జిల్లాస్థాయిలో ప్రతిభ పుత్తూరు ప్రభుత్వ బాలికల కళాశాల విద్యార్థినిలు కనబరిచిన బాలికలు
భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీలలో పుత్తూరు ప్రభుత్వ బాలికల కళాశాల విద్యార్థినిలు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి శుక్రవారం పేర్కొన్నారు. వ్యాసరచన పోటీలలో A.F ఫర్హానా (ద్వితీయ బహుమతి), వక్తృత్వ పోటీలలో B.L తమిళేశ్వరి (మొదటి బహుమతి), క్విజ్ పోటీలలో T.ఈశ్వరి (ద్వితీయ బహుమతి) సాధించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా వారికి బహుమతులు అందించి అభినందించారు.