పాణ్యం మండలం బలపనూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం డివైడర్ను ఢీకొని ఒకరు మృతి
Panyam, Nandyal | Nov 10, 2025 పాణ్యం మండలం బలపనూరు గ్రామం వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర నుంచి తిరుపతికి వెళ్తున్న స్కార్పియో వాహనం డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.