తాడిపత్రి: స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని బోయరెడ్డిపల్లి సమీపంలోని అదాని సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద నిరుద్యోగ యువకులు ధర్నా
స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ యువకులు యాడికి మండలం బోయరెడ్డిపల్లి సమీపంలో ఉన్న ఆదాని సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. కమలపాడు కు చెందిన నిరుద్యోగులు కులశేఖర్, యుగంధర్, ఓబులేష్ తదితరులు ప్లకార్డులు చేత పట్టుకొని స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. తమకు ఉద్యోగాలు ఇవ్వకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఫ్యాక్టరీ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు.