ఇబ్రహీంపట్నం: దేశవ్యాప్తంగా బీసీ కులగలన చేయాలి:అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ యాదవ్
రంగారెడ్డి జిల్లా: ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త బీసీ కుల గణనను చేయాలని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చింతల రవీందర్ యాదవ్ గురువారం అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా నాగోల్ లోని శుభం కన్వెన్షన్ హాలులో అఖిలభారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా యాదవులు పెద్ద ఎత్తున హాజరయ్యారని తెలిపారు సామాజికంగా రాజకీయంగా ఎదగాలని పేద యాదవులను ఆదుకోవాలని అన్నారు .అందుకు అనుగుణంగా ముందుకు వెళ్తామని తెలిపారు.