మెదక్: లక్ష్మాపూర్ గ్రామంలో ప్రమాదశత్తు చెరువులో పడి పంచాయతీ కార్మికుడి మృతి
Medak, Medak | Sep 18, 2025 ప్రమాదశత్తు చెరువులో పడి పంచాయతీ కార్మికుడి మృతి రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్మికుడు అనుముల నర్సింలు గురువారం చెరువులో పడి మృతి చెందాడు. గ్రామానికి నీరు సరఫరా చేసే బోరు మోటార్ మరమ్మతుల కోసం చెరువులోకి వెళ్లిన క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది, ఉదయం చెరువులోకి దిగిన నర్సింలు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలం చేరుకొని మృతదేహాన్ని స్థానికులతో కలిసి వెలికి తీసి పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసుకొని ధరప్తు చేసున్నట్లు పోలీసులు తెలిపారు.