ఆలూరు: దేవనకొండలో నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ లాంటి వ్యాధులపై మహిళలకు అవగాహన
Alur, Kurnool | Sep 17, 2025 దేవనకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం స్వస్థ నారీ -సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు విజయ భాస్కర్, కళ్యాణ్ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన మహిళే శక్తివంతమైన కుటుంబానికి, సమాజానికి పునాదని పేర్కొన్నారు. అలాగే రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ లాంటి అసంక్రమిత వ్యాధులపై మహిళలకు స్క్రీనింగ్ నిర్వహిస్తామని తెలిపారు.