యాడికి మండలం వెంగన్నపల్లి లో ఈనెల 4న లక్ష్మీదేవి అనే మహిళపై అదే గ్రామానికి చెందిన విశ్వనాథ్ బలాత్కారం చేశాడు.అంతేకాకుండా 8 వ తేదీ విశ్వనాథ్ తన సోదరులు, బంధువులు కలిసి లక్ష్మీదేవి ఇంటి పై దాడి చేశారు.దాడిలో లక్ష్మీదేవి ఈమె భర్త నారాయణస్వామి,కొడుకు నవీన్ తీవ్రంగా గాయపడ్డారు.బాధితులు ఫిర్యాదు చేసిన కేసు నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో బాధితురాలు లక్ష్మీదేవి శనివారం అనంతపురం వెళ్లి డీఐజీని ఆశ్రయించింది. జరిగిన సంఘటనను వివరించింది. డీ ఐ జీ స్పందించారు. వెంటనే యాడికి సీఐ వీరన్న కు ఫోన్ చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు.దీంతో పోలీసులు 11 మందిపై కేసు నమోదు చేశారు.