పత్తికొండ: వెల్దుర్తిలో పోలీసులు రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నేరాలకు పాల్పడితే జిల్లా బహిష్కరణ
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తిలో పోలీసులు రౌడీ షీటర్లకు ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ నేరాలకు మళ్ళీ పాలు పడితే జిల్లా బహిష్కరణ చేస్తానని మరియు ఈ సందర్భంగా వారికి హెచ్చరించారు. గ్రామాల్లో పట్టణాల్లో ఎవరు కూడా ఘర్షణ వాతావరణానికి పాల్పడరాదని శాంతిగా తమ పనులు చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఎవరైనా మళ్లీ కేసులకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.