సత్తుపల్లి: సత్తుపల్లి డివిజన్ వ్యాప్తంగా ఘనంగా భోగి పండుగ సంబరాలు
ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ వ్యాప్తంగా ప్రజలు భోగి పండుగ సంబరాలను సోమవారం తెల్లవారుజామున ఘనంగా జరుపుకున్నారు.కులమతాలకు అతీతంగా భోగి పండుగ వేడుకలు అంబరాన్ని అంటాయి.తెల్లవారుజామునే గ్రామాల్లో భోగిమంటలు వేసి సరదాగా గడిపారు.గ్రామంలోని చిన్నారులు మహిళలు,యువకులు భోగి మంటల వద్ద ఆనందంగా సంబరాలు జరిపారు.