అక్రమ ఆయుధాల సరఫరా ముఠాను అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన బొమ్మనహాల్ ఎస్ఐ నభిరసూల్ ను అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ అభినందించారు. కంట్రీమేడ్ ఫిస్టోళ్లు, మ్యాగజైన్ ల విక్రయ ముఠా సభ్యులను అనంతపురంలో గురువారం అరెస్టుచేశారు. ప్రత్యేక బృందాలలో ఒక బృదానికి నేతృత్వం వహించిన బొమ్మనహాల్ ఎస్ఐ నభిరసూల్ శుక్రవారం SP చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. ఆయన్ను పలువురు స్టేషన్ సిబ్బంది, మండల ప్రజలు అభినందించారు.