వెంకటగిరి రైల్వే స్టేషన్లో ప్రయాణికుల ఇబ్బందులు #localissue
Gudur, Tirupati | Sep 14, 2025 తిరుపతి జిల్లా వెంకటగిరి రైల్వేస్టేషన్లో ప్రయాణికుల ఇబ్బందులు తప్పడం లేదు. ఆదివారం రాత్రి కోచ్ పొజిషన్ డిస్ప్లే బోర్డులు పని చేయడం లేదని పలువురు వాపోయారు. ఈ వారంలో పోలేరమ్మ జాతర జరిగిన సంగతి తెలిసిందే. ఈ జాతరకు దూర ప్రాంతాల నుండి వచ్చిన వారు తిరుగు ప్రయాణమైన వారికి ఇప్పడు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత రైల్వే అధికారులను వివరణ కోరగా రెండు రోజుల్లో సమస్య ను పరిష్కరిస్తామన్నారు.