మల్కాజిగిరి నియోజకవర్గంలోని సఫీల్గూడ కట్ట మైసమ్మ గుడి వద్ద జరిగిన అపవిత్ర ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆదివారం తీవ్రంగా స్పందించారు. బొడ్రాయిపై ఓ ముస్లిం వ్యక్తి చేసిన అపవిత్ర చర్య హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసేలా ఉందన్నారు. ఇటీవల కాలంలో ఉద్దేశపూర్వకంగానే హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇలాంటి ఘటనలు సమాజంలో ఉద్రిక్తతలకు దారి తీసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు లోనుకాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రాంచందర్రావు డిమాండ్ చేశారు.